నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని, ప్రజలతో కలుపుకుని తాము ఆందోళన చేస్తే తమపై మంత్రి నారాయణ విమర్శలు చెయ్యడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు మంగళవారం ఉదయం ఆయన తెలిపారు.