క్యాసినోల నిర్వహకుడు చీకోటి ప్రవీణ్(Chikoti Praveen)కు ఈడీ(ED) అధికారులు తాజాగా ఇంకోసారి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే క్యాసినో కేసుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ చీకోటీపై కేసు నమోదు చేసింది.
అయితే ఈ కేసులో ఇప్పటికే కొన్నిసార్లు ప్రవీణ్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా థాయ్ లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ అంశంలో చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.