CM Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మరోసారి సమాన్లు జారీ చేసింది. రాజధాని రాంచీలో భూమి కొనుగోలు విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సోరెన్ విచారణకు రావాల్సిందిగా ఇంతకు ముందు అయిదుసార్లు సమాన్లు జారీ చేసింది. తాజాగా మళ్లీ ఆరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో పంపిన నోటీసులపై సోరెన్ సుప్రీంకోర్డుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో రాంచీలోని జోనల్ కార్యాలయంలో సీఎం సోరెన్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో సోరెన్‌ను ఈడీ ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఛవీ రంజన్ కూడా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.