Article 370: కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది రాజ్యంగానికి వ్యతిరేకమని పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్డు ఈరోజు తీర్పును వెలువరించింది.
Article 370: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370 అధికరణాన్ని నాలుగేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే అంశంపై ఈరోజు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీం తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ల బృందం దీనిపై తీర్పునిచ్చారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు రాజ్యంగ వ్యతిరేకమని జమ్మూకశ్మీర్‌లోని కొన్ని పార్టీలు భావించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి విచారణ జరిపి తాజా తీర్పును వెలువరించింది.