»Ed Notices To Telangana Trs Minister Gangula Kamalakar Swetha Granites
ED notices: మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు
బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar)కు చెందిన సంస్థకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు అతని కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు.
Who Is Pawan Kalyan, Minister Gangula Kamalakar Asked
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తన ఫ్యామిలీకి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారని తెలిపారు. ఆ నేపథ్యంలోనే రూ.74.8 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించారని ప్రాథమికంగా గుర్తించి నోటీసులు జారీ చేశారు.
గతేడాది నవంబర్లో శ్వేతా ఏజెన్సీల్లో ఈడీ(ED) సోదాలు కూడా నిర్వహించింది. చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎగుమతిలో అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. గ్రానైట్ల ఎగుమతి ద్వారా ఫెమా నిబంధనలలో రూ.4.8 కోట్ల మోసం జరిగినట్లు ఈ ఏజెన్సీలు గుర్తించాయి. దాదాపు రూ.50 కోట్లు పెండింగ్లో ఉండగా శ్వేతా ఏజెన్సీలు కేవలం రూ.3 కోట్లు మాత్రమే చెల్లించాయి. మరోవైపు హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ నేత మనీ లాండరింగ్ కేసులో చిక్కుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంకా అనేక మంది బీఆర్ఎస్(BRS) నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.