గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh)పై విధించిన సస్పెన్షన్‌ను తొలిగించడంపై బీజేపీ అధిష్టానం అంగీకరించలేదని సమాచారం. గోషామహల్ అసెంబ్లీ వదులుకొని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ (Zaheerabad) లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌పై బీజేపీ (BJP) అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్(Vikram Goud)ను పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గోషామహల్‌ను వదిలిపెట్టాలని రాజాసింగ్‌కు అధిష్టానం సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి : woman married 12 men: 12 మందిని పెళ్లాడిన మహిళ..పోలీసులు షాక్
అయితే పార్టీ అధిష్టానం డిమాండ్‌కు రాజాసింగ్ అంగీకరించలేదని, గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో రాజాసింగ్‌కు మంచి పట్టుంది. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆయనకు సూచించినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) బీజేపీ తరపున గెలుపొందిన ఏకైక వ్యక్తి రాజాసింగ్ మాత్రమే.ఇప్పటికే గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ యాక్టివ్‌గా తిరుగుతున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ (BJP) అభ్యర్థి తానేనని ఇప్పటికే పలుమార్లు బాహటంగానే విక్రమ్ గౌడ్ (Vikram Goud) ప్రకటించారు.ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ విధించి ఏడాది దాటింది.
చదవండి : Nayanthara : ‘జవాన్’లో నయనతార లుక్ ఇదే

