WHO: కూల్‌డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తోందా.? డబ్ల్యూహెచ్ఓ అధ్యాయనం.!
పదర్థాలలో తీపికోసం వాడే యాస్పర్టేమ్ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీనిని ఎక్కువగా కూల్ డ్రింక్స్ లో, బేకరి, స్వీట్ షాపులలో వాడుతారని వెల్లడించింది.
Does drinking Soft drinks cause cancer.. WHO study
WHO: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని అందరికి తెలుసు.. అయినా సరే చాలా మంది ఈ విషయాన్ని పెడచెవున పెడుతుంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెప్పిన విషయం తెలిస్తే వణుకుపుడుతుంది. మనం ఎంతో ఇష్టంగా తాగే కూల్ డ్రింక్స్(Cool Drinks) లో క్యాన్సర్(Cancer) ను ప్రేరేపించే పదార్థాలు ఉన్నాయట. కేవలం డ్రింక్స్ మాత్రమే కాదు ఐస్‌క్రీములు, బేకరీ పదార్థాలతో కూడా ఈ మప్పు వాటిల్లే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ముఖ్యంగా వీటిలో తీపి కోసం యాస్పర్టేమ్ (Aspartame) ను కలుపుతుంటారు. ఈ అనర్థాలకు కారణం ఇదే అని చెబుతున్నారు. తీపిపదర్దాలను తయారు చేసేటప్పుడు పంచదార బదులు ఈ యాస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ (Artificial Sweetener) ను ఉపయోగిస్తారు. 1980 నుంచి దీని వాడకం మొదలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది పంచదార (Sugar) కన్నా తీపిగా ఉంటుంది. అందుకే కొద్ది మొత్తంలో ఆహారంలో లేదా డ్రింక్‌లో కలిపుతారు.
దీనిని ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలలో కలుపుతారు. ఎందుకంటే వేడి చేస్తే యాస్పర్టేమ్ తీపిదనాన్ని కోల్పోతుంది. ప్రస్తుతం ఈ కృత్రిమ స్వీట్నర్ను మనం రోజూ ఉపయోగిస్తున్న సాఫ్ట్ డ్రింక్స్ (Cool Drinks), డైట్ కోక్‌లు, జెలటిన్, ఐస్‌క్రీమ్, యోగర్ట్ తదితర డయరీ ఉత్పత్తులు, తీపిగా ఉండే దగ్గు సిరప్లు, చూయింగ్ గమ్‌లు, టూత్‌పేస్టులు మొదలైన వాటిలో కలుపుతున్నారు. అలాగే తక్కువ క్యాలరీ, షుగర్ ఫ్రీ, డైట్ చేసేవారు ఆహారం కోసం చూసే వారు ఈ యాస్పర్టేమ్ను స్వీట్నర్గా తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
అయితే యాస్పర్టేమ్ వలన క్యాన్సర్‌ను వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యహెచ్ఓ (WHO)చెప్పినప్పటికీ.. ఇది చాలా ప్రాథమిక స్థాయిలో జరిగిన అధ్యయనంగా తెలుస్తోంది. కచ్చితంగా క్యాన్సర్‌కు దారి తీయొచ్చు అని చెప్పడానికి ఇంకా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ), ఫుడ్ అండ్ అగ్రకల్చర్ ఆర్గనైజేషన్, జాయింట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్ (జేఈసీఎఫ్ ఏ) తదితర సంస్థలు యాస్పర్టిమ్ వాడకానికి, క్యాన్సర్‌కు ఉన్న సంబంధంపై పరిశోధనలు ఇంకా కొనసాగిస్తున్నాయి. వీలైనంత వరకు వీటి వాడుకను తగ్గించుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
చదవండి:Rahul Gandhi: రాహుల్ గాంధీ పిటిషన్ పై జులై 21న సుప్రీం కోర్టులో విచారణ