TG: సంగారెడ్డి కొత్త బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి, పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఉదయం రాహుల్ దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశాయి. దీనికి నిరసనగా జగ్గారెడ్డి.. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.