NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు శనివారం ప్లాస్టిక్ ఫ్రిస్కింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసి, ప్లాస్టిక్ వస్తువులను గుర్తించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అధికారులు తెలిపారు.