NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పర్యటించారు. ఇటీవల రైలు ప్రమాదంలో తపాలా చౌడయ్య రెండు కాళ్లు కోల్పోయాడు. తనకు ప్రభుత్వం నుంచి ఇంకా పింఛన్ మంజూరు కాలేదని బాధితుడు చౌడయ్య బీసీ ఇందిరా రెడ్డికి తెలియజేశాడు. ప్రతినెల రూ. 3,000 బాధితునికి అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు.