కడప: జిల్లాలో 8 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా తాత్కాలిక ప్రమోషన్లు కల్పిస్తూ.. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆరుగురికి నందలూరు, చెన్నూరు, కడప అర్బన్, టి. సుండుపల్లి, మైలవరం, బి. కోడూరుల్లో పోస్టింగ్ ఇవ్వగా, ఒకరిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. మరొకరి స్థానం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.