GDWL: మార్కుక్ మండలం దామరకుంట గ్రామంలో నల్లపోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ పత్తి నర్సింలు యాదవ్ మాట్లాడుతూ.. గ్రామదేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని, ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు.