SDPT: మల్లన్న సాగర్ కాలువ ద్వారా చింతమడక పెద్ద చెరువుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం రైతులు సిద్దిపేట-హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి.