ASR: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఓనూరు గ్రామంలో పర్యటించిన ఆయన, జల జీవన్ మిషన్ పనులను పరిశీలించారు. జల జీవన్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.