W.G: ఆకివీడు జాతీయ రహదారి పక్కన ఉన్న లైబ్రరీ వద్ద ఆక్రమణలను నగర పంచాయతీ అధికారులు శనివారం తొలగించారు. తోపుడుబండ్లు, చిరు వ్యాపారుల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ఈ ప్రదేశంలో తరచుగా వాహనాలు స్తంభిస్తుండటంతో స్థానికుల ఇబ్బందులను గమనించి ప్రక్షాళన చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.