Shilpa shetty: బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వయసు 48 ఏళ్లు అయినా, చూడటానికి ఇప్పుడే ట్వంటీస్ క్రాస్ చేసినట్లు ఉంటుంది. ఆమె అలా కనపడటానికి ఆమె అందం, ఫిట్ నెస్ కారణం. కరీనా కపూర్ తో కలిసి ఓ షోలో పాల్గొనగా అక్కడ తన ఫిట్నెస్ సీక్రెట్ చెప్పారు. ఎవరైనా బరువు తగ్గి, సన్నగా మరాలి అనుకుంటున్నారో, వారు ఏం చేయాలో ఆమె వివరించారు. కరీనా అడిగిన ప్రశ్నలకు శిల్పా శెట్టి చెప్పిన సమాధానాలేంటో ఓసారి చూసేయండి.
శిల్పా శెట్టి తాను డైటింగ్ చేయనని చెప్పింది. తన పొట్టను రోజు పండ్లు, జ్యూస్‌తో నింపి ఉంచనని కూడా ఆమె చెప్పారు. కేవలం నవరాత్రుల సమయంలో అలా పండ్లు తీసుకుంటానని, మామూలు సమయంలో మంచి ఆహారం తీసుకుంటానని చెప్పారు.
డైట్ పేరుతో తిండికి దూరంగా పారిపోవద్దని సలహా ఇచ్చారు. నెయ్యి నుంచి దూరంగా వెళ్ళవద్దని చెప్పారు. సరైన ఆహారం తినమని సూచించింది. మీరు ఎప్పుడు తింటారు, ఎంత తింటారు, ఎందుకు తింటారు, ఎలా తింటారు అనే విషయాలను గమనించాలని శిల్పాశెట్టి సలహా ఇచ్చారు.
బరువు తగ్గాలి అనుకునవారు కార్బో హైడ్రేట్స్కి దూరంగా ఉండాలని చెబుతుంటారు, ఈ రోజుల్లో నో కార్బొ హైడ్రెడ్స్కి ప్రజాదరణ పొందుతోంది. ఫిట్నెస్ కోసం శిల్పా ఈ నిబంధనలను పాటించడం లేదు. నటి ఫ్రెంచ్ టోస్ట్‌ను ఇష్టపడుతుంది. కార్బోహైడ్రేట్లను తీసుకుంటుంది.
డెలివరీ తర్వాత ఆమె 32 కిలోల బరువు పెరిగినప్పుడు తక్కువ పిండి పదార్థాలు..నో కార్బ్స్ రూల్స్ పాటించినట్లు చెప్పారు. ఇది మ్యాజిక్‌లా పనిచేసిందని శిల్పా చెప్పింది. కార్బొహైడ్రేట్లు చాలా ముఖ్యమైనవి. ఇది బలాన్ని ఇస్తుంది. మీరు ఏ పిండి పదార్థాలు తీసుకుంటారనేదే ముఖ్యం అని శిల్పా శెట్టి చెప్పారు. వేయించిన బంగాళా దుంపలను తినకుండా, ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినమని సలహా ఇస్తున్నారు. సాయంత్రం 6 లేదా 7 గంటల తర్వాత పిండి పదార్ధాలను తినకూడదని సూచించారు.
మానసిక ఆరోగ్యానికి ప్రాణాయామం , ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. యోగా శరీరం, మనస్సు , ఆత్మలో చాలా మార్పు తెచ్చింది. ఏం చేసినా రాత్రి పడుకునే ముందు 12 నిమిషాలు తన కోసం కేటాయిస్తారు. ఆ సమయంలో మెడిటేషన్ , లాంగ్ బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తాను అని శిల్పా చెప్పింది. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కూల్‌గా ఉన్నానన్నది అబద్ధం. అందరికీ సమస్యలు ఉంటాయి. మీరు నిరుత్సాహానికి గురైనట్లయితే, నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి. కుటుంబ సభ్యుల ముందు అన్నీ చెప్పలేం. సైకాలజిస్ట్‌ని కలవడం ఇబ్బందికరం కాదని శిల్పా సలహా ఇస్తున్నారు.
ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే వ్యక్తులు కేవలం వర్కవుట్ చేస్తే సరిపోదు అని ఆమె చెప్పారు. మంచి డైట్ పాటించాలి. అప్పుడప్పుడు చీట్ మీల్స్ తినవచ్చని చెప్పారు. మైదా, పంచదారకు పూర్తిగా దూరంగా ఉండమని సూచించారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం అని సూచించారు.