Anchor Anasuya makes sensational comments that the movie Baby is like a story of those who know it, tweet viral
ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) హీరోగా , వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్గా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం కాబోంది. ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రైలర్ పై ప్రముఖ యాంకర్, నటీ అనసూయ(Anasuya) ట్వీట్ చేసింది. ఆ వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ(Anasuya) బేబీ సినిమా ట్రైలర్ పై ట్వీట్ చేసింది. సంభాషణలు గుండెను హత్తుకునేలా ఉన్నాయని, తాను చాలా లేట్‌గా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నానని వివరించారు. డైరెక్టర్ సాయి రాజేష్’ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, అంచెలంచెలుగా ఎదుగుతున్నారని పేర్కొంది. మూవీలోని కథ తనకు తెలిసిన వారి కథలా ఉందని ట్వీట్ చేశారు. ఎస్ కె ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ(Baby) మూవీ జూలై 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.