అన్నమయ్య: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా, శుక్రవారం పుల్లంపేట మండలంలోని పలు గ్రామాల్లో బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పుల్లంపేట, కొత్తపేట, అనంతంపల్లి హెల్త్ సెంటర్లలో అర్హులైన బాలికలకు టీకాలు వేశారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. మండలాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు.