అన్నమయ్య: మైనార్టీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 24న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో MPC-40, BiPC-40, CEC-35 సీట్లు ఉన్నాయని తెలిపారు.