రామ్ గోపాల్ వర్మ మరోసారి ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రం భారతీయ సినిమాలో విప్లవం తెచ్చిందని, మేకింగ్ శైలిని మార్చేసిందని అన్నాడు. అయితే, దీనివల్ల పెరిగిన బడ్జెట్ భారంతో ఇండస్ట్రీ ఆయనపై కోపంగా ఉందని, ఆదిత్య-యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ చూస్తున్నారని, కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని వర్మ హెచ్చరించాడు.