PLD: రేపు నిర్వహించే అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 100 శాతం హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా సూచించారు. శుక్రవారం టీసీ ద్వారా సంబంధిత అధికారులతో పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో అక్షరాంధ్ర కింద 1,27,627 మందిని గుర్తించామన్నారు. వీరందరూ అక్షరాస్యులుగా మారాలని కలెక్టర్ పేర్కొన్నారు.