W.G: పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రైతులకు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఏడీ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు.