NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొల్పిన తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ మేరకు అధికారులు వివరాలు శుక్రవారం వెల్లడించారు. ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కులు ద్వారా నీటి విడుదల జరుగుతున్నందున మూడు టర్బయిన్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని డీఈ శ్రీనివాస్ తెలిపారు.