TG: LPGకి ప్రత్యామ్నాయంగా డై మిథైల్ ఈథర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని భారతీయ రసాయన సాంకేతికత సంస్థ చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరాయి. సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికతతో పైలట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్లు, బర్నర్లు, పంపిణీ వ్యవస్థల్లో 20 శాతం వరకు DMEని LPGతో కలిపి వాడుకోవచ్చు.