JGL: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రవికిరణ్ శుక్రవారం తెలిపారు. నర్సయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెందిన నర్సయ్య గ్రామ శివారులోని పుట్ట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.