NGKL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దండ ఎంపీడీవో కృష్ణయ్య పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో మంజూరైన 425 ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే 32 గ్రామాల్లోని నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు నాటడం, 100 శాతం పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.