ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్‌గా నెక్ట్స్ లెవల్లో ఉంది. అందుకే రాజమౌళి అంటే అందరికీ ఎంతో స్పెషల్.. కానీ ఓ బ్యాచ్ మాత్రం జక్కన్నను టార్గెట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రాజమౌళి ఇప్పుడు.. మహేష్ కోసం స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో.. అందరి చూపు దీని పైనే పైనే ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ లోపు రాజమౌళి ఓ బాలీవుడ్ సినిమాను తన భుజాల పై వేసుకున్నాడు. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర.. తెలుగులో రాజమౌళి సమర్పణలో రానుంది.
బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో.. నాగార్జున కీలక పాత్రలో నటించాడు. దాంతో బ్రహ్మాస్త్ర పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. దాంతో ఈ సినిమాకు కూడా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ.. బాయ్ కాట్ అంటు ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఇన్వాల్వ్ అవడంతో.. బాయ్ కాట్ బ్యాచ్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. రాజమౌళి అంటే తమకు అపారమైన గౌరవం ఉందని.. ఆయన బాలీవుడ్ మేకర్స్ మాయలో పడొద్దని.. బ్రహ్మాస్త్రను ప్రమోట్ చేయొద్దని అంటున్నారు. కానీ దర్శక ధీరుడు మాత్రం.. ఇవేవి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రమోషన్స్‌లో దూకుడుగా ఉండే రాజమౌళి.. ఇప్పటికే బ్రహ్మాస్త్ర కోసం రంగంలోకి దిగిపోయాడు.. తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాస్త్ర రాజమౌళి అండతో గట్టేక్కేలానే ఉందంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి.