NLG: డా. బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 2,4,6 సెమిస్టర్ లకు కౌన్సిలింగ్ తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయని ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ D.V వెంకటేశ్వర్లు తెలిపారు. రీజనల్ సెంటర్, స్టడీ సెంటర్స్ కోఆర్డినేటర్స్ విద్యార్థులకు సమాచారం అందించాలని, విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతులు నిర్వహించాలని కోరారు.