Circle movie review: సర్కిల్ మూవీ రివ్యూ..రొమాన్స్ అయితే
సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్(Circle) ఈరోజు(జులై 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు జాతీయ అవార్డులు దక్కించుకున్న నీలకంఠ(Neelakanta) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడంలో డైరెక్టర్ నీలకంఠ ఒకరు. గతంలో షో అనే సినిమాతో ఆయన మన ముందుకు వచ్చారు. ఆ సినిమాకి రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న తాజా చిత్రం సర్కిల్(circle). “ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో” అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తాజాగా(జులై 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ రివ్యూ ఓసారి చూద్దాం.
మూవీలో కథ విషయానికి వస్తే
ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన కైలాష్ (సాయి రోనక్). ఒక సుపారీ కిల్లర్ పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్) కైలాష్ ని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు ఆ పరిస్థితి కైలాష్ కి ఎందుకు వచ్చింది..? వీరి కథకి ఆర్టిస్ట్ అరుంధుతి (రిచా పనై), ఎంపీ కూతురు మాళవిక (నేహా ఎల్లారెడ్డి), రాజస్థానీ యువరాణి హిమానీ రాజ్‌పుత్ (అర్షిన్ మెహతా)లకు ఏంటి సంబంధం అనేదే మూవీ కథ.
నటీ నటుల విషయానికి వస్తే..
సాయి రోనక్ ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో చాలా తేలికగా నటించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా మంచి ఎమోషన్స్ పలికించాడు. అతనిలోని రొమాంటిక్ యాంగిల్ ఈ మూవీతో బయటపడింది. ఇక, ఒకరు తనను చంపాలని అనుకుంటున్నప్పుడు అతని నటన మరింతగా ఆకట్టుకునేలా ఉంది. సుపారీ కిల్లర్‌గా బాబా భాస్కర్ నటన కూడా ఆకట్టకునేలా ఉంది. రిచా పనై, న్యానా యల్లారెడ్డి, అర్షిన్ మెహతా, స్నేహల్ కామత్, ఆకాంక్ష గాడే తమ పాత్రలకు న్యాయం చేశారు. రిచా, నయన, అర్షిన్ ఆసక్తికరమైన కథకు గ్లామర్ జోడించారు.
టెక్నీషియన్స్ పనితీరు
నీలకంఠ రాసిన సర్కిల్ కథ మానవ భావోద్వేగాలు, సంబంధాలను హైలైట్ చేయడానికి ప్రయత్నించింది. మనకు తెలీకుండానే మనకు అనుకోకుండా శత్రువులను ఎలా తయారు అవుతారనే కథ లైన్ తో మూవీని తెరకెక్కించారు. నీలకంఠ ఆలోచన భిన్నంగా, ఆసక్తికరంగా ఉంది. కథనం కూడా ఆసక్తికరంగానే తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్‌లో రొమాంటిక్ ఎలిమెంట్స్, కథానాయకుడు కిల్లర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ ఉంటుంది. ఇది సెకండ్ హాఫ్‌కి వేదికగా నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ కేవలం ఒక రొమాంటిక్ ఎఫైర్‌తో మాత్రమే నడిచింది. ఇది సినిమాకి కాస్త మైనస్ గా మారింది. మళ్లీ క్లైమాక్స్ లో సినిమాని ఆసక్తికరంగా మార్చారు. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ మరి కొంత సేపు కసరత్తు చేసి ఉంటే, ఫలితం ఇంకా బాగుండేది అనే భావన కలుగుతుంది. రంగనాథ్ గోగినేని తన కెమెరా యాంగిల్స్‌తో సినిమాను అందంగా తీర్చిదిద్దారు. లోకేషన్స్ ని తన కెమేరా పనితనంతో వీలైనంత అందంగా ఉండేలా చూసుకున్నాడు. మధురెడ్డి ఎడిటింగ్ ఓకే కానీ సెకండాఫ్‌లో ఇంకాస్త తన కత్తెరకు పని చెబితే బాగుండేది అనిపించింది. NS.ప్రసు స్వరాలు యూత్‌ఫుల్‌గా, రొమాంటిక్‌గా ఉన్నాయి. పాటలు చాలా అందంగా చిత్రీకరించారు. డైలాగ్స్ యూత్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లాస్ పాయింట్స్
+హీరో, బాబా బాస్కర్ యాక్టింగ్
+నిర్మాణ విలువలు
+సినిమాటోగ్రఫీ