తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న ప్రవీణ్ కుమార్.. సర్కార్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొందరిలా తాను తన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయనన్నారు. కానీ.. దోపిడి, చీకటి సామ్యాజ్యాలను ధ్వంసం చేసి.. మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తానంటూ చెప్పుకొచ్చారు. యాపిల్ సంస్థ నుంచి వచ్చిన మెయిల్‌ను ట్వీట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ..అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కొద్దిరోజుల కిందట యాండ్రాయిడ్ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా దిగజారి ప్రవర్తిస్తున్నది. పార్టీలో అంతర్గత సమాచారం పార్టీ నేతలకంటే ముందే బీఆర్ఎస్కు తెలిసిపోతున్నది అని డిసెంబరు 16న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
కాగా నేటి నుండి సిర్పూర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార రెండవ విడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. నేడు కాగజ్‌నగర్ పట్టణం నుండి ప్రారంభం కానున్న బహుజన రాజ్యాధికార రెండవ విడత యాత్ర సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కొనసాగనుంది.