యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అనసూయను టార్గెట్ చేస్తూ, ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నాడు. దీనిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.