పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇదే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మార్చి 30న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్గా ఖుషి రీ రిలీజ్ సందర్భంగా.. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ గురించి చెప్పుకొచ్చారు నిర్మాత ఏఎం రత్నం. రిపబ్లిక్ డే నాడు.. జనవరి 26న టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ టీజర్లో ఇటీవలె రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్‌లోని కొన్ని షాట్స్ చూపించబోతున్నారట. ఈ సీక్వెన్స్ పవన్ ఆద్వర్యంలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే టీజర్ కోసం వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే.. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు పవన్. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుజీత్ ప్రాజెక్ట్‌తో పాటు.. వినోదయ సీతమ్ రీమేక్ చేయనున్నారు.