VSP: ఈనెల 16, 17వ తేదీల్లో విశాఖలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీల కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి యూ.నాగరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కన్వెన్షన్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,371 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.