»A Man Who Urinated On A Tribal Youth In Police Custody
Madhya Pradesh: పోలీసుల అదుపులో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన (urinating on tribal) చేసిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. నిన్న సాయంత్రం నుంచి ఈ ఘటన వివాదాస్పదం కావడంతో పోలీసులు శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్ట్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు.
https://twitter.com/i/status/1676224358686027776
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో మూడు నెలల కిందట ఈ ఘటన జరిగింది. తాగిన మత్తులో ఊగుతూ ఓ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం నెలకొంది. ఈ వ్యక్తి ప్రముఖ రాజకీయా నాయకుడి అనుచరుడు అని ట్విట్టర్ లో ప్రచారం జరిగింది. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. నిందితుడిని అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
నిందుతుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోలో ఉన్న వ్యక్తి ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. వీడియో వైరల్ కావడంతో అతడు పరారీలో ఉన్నట్లు గమనించిన పోలీసుకు బృందాలుగా ఏర్పడి సాంకేతికత సాయంతో అతడిని ట్రాక్ చేశారు. ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి అతడిని అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్లాకు భాజపాతో సంబంధం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే దీన్ని కాషాయ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.