VZM: జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.