తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల కిందకే వస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఆదివాసీయేతరుల అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న కోర్టు..ఈ మేరకు తీర్పు వెలువరించింది.