TG: పోలీసులు, ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బుక్ కాంగ్రెస్కు చుట్టమైందన్నారు. రైతు బంధు పేరు చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.