BHPL: గృహ అవసరాల కోసం అందించే LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్న వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని అన్నారు.