W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అదాని, అంబానీలకు ఊడిగం చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ఆరోపించారు. ప్రజా సమస్యలపై సీపీఎం చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర శుక్రవారం నరసాపురం చేరింది. ఈ సందర్భంగా పంజా సెంటర్లో కేంద్ర కమిటీ సభ్యురాలు మాట్లాడారు.