SDPT: బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లలో భాగంగా ఈనెల 20న ఆదాయ వ్యయ టెండర్లను నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర, తై బజార్, కేళాలు, పుట్నాలు విక్రయాలతో పాటు పూల అలంకరణ, పందిర్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ అలంకరణలకు కూడా వేలం నిర్వహించనున్నారు.