ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిత అధికారికంగా ప్రారంభించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాల ప్రతినిధులు రక్తదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మీరు చేసే రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని ఆమె పేర్కొన్నారు.