NRML: నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూ. 72 లక్షల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 20 లక్షలతో రెండు VO భవనాల నిర్మాణం, రూ.20 లక్షలతో రెండు VO వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.