»Rahul Gandhi Said We Will Give A Pension Of Rs 4000 In Telangana Brs Is Bjp Support Party At Khammam
Rahul gandhi: రూ.4 వేల పింఛన్ ఇస్తాం..BRS బీజేపీ సపోర్ట్ పార్టీ
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు.
తెలంగాణలో BRS పార్టీ బీజేపీ బంధువుల పార్టీగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi)వ్యాఖ్యానించారు. అంతేకాదు బీజేపీ తెలంగాణలో తుడుచుపెట్టుకుపోయందని ఖమ్మం కాంగ్రెస సభలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధికార భారతీయ జనతా పార్టీకి “బి-టీమ్” అని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడూ నిలబడుతుందని, అయితే కేసీఆర్ పార్టీ మాత్రం బీజేపీ బీ-టీమ్‌లా వ్యవహరిస్తోందని రాహుల్ అన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు తానే రాజు అని, తెలంగాణ తన రాజ్యమని భావిస్తున్నారని, ఆయన పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రిష్టేదార్ సమితి లాంటిదని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు రిమోట్ కంట్రోల్‌ను పీఎం నరేంద్ర మోదీ మోసుకెళ్లారని ఎద్దేవా చేశారు.
దీంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసే స్కాములు అన్ని బీజేపీకి తెలుసని ఆరోపించారు. అయినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీ పార్టీ మధ్యనే ఉంటుందని రాహుల్ అన్నారు.