ప్రపంచవ్యాప్తంగా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) వేదికగా నిలుస్తోంది. చిన్నపాటి సమస్యలను ఇంటర్నెట్లో చర్చకు పెట్టి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నెటిజెన్లు. ఇషాన్ శర్మ (Ishaan Sharma) అనే క్రియేటర్, కోడర్… బెంగళూరు(Bangalore)లో జీవించేందుకు అవసరమైన కనీస శాలరీ గురించి ట్విట్టర్ ద్వారా యూజర్లను అడిగాడు. “బెంగళూరులో ఒక ఫ్రెషర్ జీవించడానికి, పని చేయడానికి అవసరమైన కనీస జీతం (Minimum Salary) ఎంత?” అని ఇషాన్ తన పోస్ట్‌లో ప్రశ్న అడిగాడు.
2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా పీజీలో ఉండే ఫ్రెషర్‌కు రూ.30,000, ఫ్లాట్‌లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాచిలర్ల (Bachelors) కు రూ. 50,000, పెళ్లయిన వారికి రూ. 75,000, టూబీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ. 1,00,000 ప్రతి నెలా చేతిలో ఉండాలని ఓ యూజర్ (User) రాసుకొచ్చారు. అక్కడ ఎంత సంపాదించినా తక్కువే అని మరో యూజర్ రిప్లయి ఇచ్చారు. అలాగే మరికొందరు తమకు తోచిన విధంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఒక మహిళ చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. మెట్రో నగరం(Metro city)లో జీవించడానికి ఫ్రెషర్‌కు నెలకు రూ. 50,000 కూడా సరిపోదని ఆమె పేర్కొన్నారు.