BDK: తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించిన కవయిత్రి అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఇవాళ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.