అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న ఆమె, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.