పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం బ్రో(BRO Movie). తమిళ్ సినిమా ‘వినోదయ సిత్తం’కి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సముద్రఖని(Samudrakhani) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ మూవీ జులై 28వ తేదిన థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు.
బ్రో మూవీ టీజర్:
బ్రో మూవీ(BRO Movie)కి సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల(Teaser Release) చేసింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దర్శకుడు సముద్రఖని(Samudrakhani) ఆధ్వర్యంలో పవన్ ఈ టీజర్ డబ్బింగ్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
టీజర్(Teaser)లో మామాఅల్లుడ్లు అదరగొట్టేశారు. టీజర్‌ను చూసిన ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు థమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. టీజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. జులై 28న ఈ మూవీ రిలీజ్(Release) కానుంది.