WNP: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 2 కే రన్లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.