»Rs 50 Kg Tomato Price At Ap Good News For Ap People
Tomato: రూ.50కే కిలో టమాటా..ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్(ap) వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటంటే టమాటా(tomatos) ధరలను సబ్సీడీపై ప్రభుత్వం రూ.50కే అందించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు సెంచరీ దాటేశాయి. ఈ క్రమంలో ఏపీ(ap)లోని పలు వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ రాహుల్ పాండే బుధవారం పర్యటించి ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. టమాటా(tomatos)లను ప్రజలకు రూ.50కే సబ్సిడీపై అందించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కర్నూల్, కడప జిల్లాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. అయితే రైతుల నుంచి నేరుగా టమాటా పంటను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గురువారం నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టమాటాలను 50 రూపాయలకు(rs 50) అందించనున్నట్లు రాహుల్ పాండే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు రైతుల(farmers) నుంచి 50 నుంచి 60 టన్నుల టమాటాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ధరలను తగ్గించడంలో అధికారిక జోక్యంలో భాగంగా తమ పరిధిలోకి అన్ని రైతు బజార్లలో టమోటాలు కొనుగోలు కోసం ప్రజలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు టమాటా పంటను దెబ్బతీస్తాయని, సరఫరాలో స్వల్పంగా విరిగిపోయినా భారీ ప్రభావం చూపుతుందని ఆయన అన్నాారు. ఈ క్రమంలో ధరల నుంచి రైతును, వినియోగదారులను కూడా రక్షిస్తామని వెల్లడించారు. AP సంవత్సరానికి మూడు టమోటా పంటలను పండించే రాష్ట్రమని రాహుల్ పాండే పేర్కొన్నారు. ఈ పంటల మధ్య చిన్న ఖాళీలు రావడం వల్ల కొన్నిసార్లు ధరలలో హెచ్చుతగ్గులు వస్తాయని అన్నారు. ఒక పంట ముగిసింది. త్వరలోనే ఇంకో పంట చేతికొచ్చిన తర్వాత టమాటా ధరలు స్థిరపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.