PLD: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రజలకు, పశువులకు ఇబ్బందులు రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం నరసరావుపేట కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ తాగునీటి సరఫరా, వడదెబ్బ నివారణ చర్యలు, ఉపాధి హామీ పనుల వేళల మార్పు, పశువులకు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు.